Tuesday, May 31, 2022

హరికథలో వ్యాకరణశాస్త్ర చమత్కారం

 

జానకీ శపథము హరికథలోని ఈ సీసపద్యంలో చమత్కారం వ్యాకరణ శాస్త్రంలో కనీసం

ప్రాధమికమైన ప్రవేశముంటే గాని అవగావహమవదు.

 

పల్లమువంకఁ బ్రవర్తించె నీర్వి శే

ష్యము జాడఁజను విషేషణముభంగి

అడవి కార్చిచ్చుల కాదేశమై కొండ​

వరదయాగమమయ్యె జెరువులకును

అల ప్రకృతిప్రత్యయము లట్టు లన్యోన్య​

మెడయ కేళ్ళుం గాల్వలేకమయ్యె

కర్మభావవప్రయోగంబుల దప్పని

యాత్మనేపదమట్టు లలరెకప్ప​

వడి నలౌకిక విగ్రహవాక్యము వలెఁ

గోకిల రవప్రమోగంబులేక యుండె

పల్లవిత బహువ్రీహి సంపతటలమగుచుఁ

బ్రబలి వ్యాకరణమువలె వానవెలిసె

Friday, July 30, 2021

ఒక సీస పద్యంలో సర్వమత సారం!

ఆది కారణ మెన్న రాదు కావున స్వ​

భావము లోకమని చెప్పు బౌద్ధమతము

జగ మబద్ధము బ్రహ్మ సత్యం బటంచు నెం

తయు, బోధపర్చు నద్వైతమతము

సగుణుఁ డీశుడు ప్రపంచము వానియిచ్ఛావి

భూతి యంచు గణించు ద్వైతమతము

ఇహమె నిక్కము పరం బెల్లఁ గల్ల యటంచుఁ

దెల్లము సేయు నాస్తిక మతంబు

 

ఇన్నిమతములలో సార మెంచి యెంచి

దయయు నిర్మోహము న్భక్తిధర్మబుద్ధి

నాల్గిట న్గ్రమముగఁ బొందినయము మీఱ

జయము మనమంద వలయు నో సభ్యులార​!

Friday, July 23, 2021

గజరాజును రక్షించటకు బయలుదేరిన శ్రీహరిని అనుసరించిన శ్రీలక్ష్మి విధము

అంసభాగంబున నాడెడు గొప్ప కొ

ప్పున సన్నజాజులు పుడమిరాలఁ

జిన్ని కెంజాయ వాల్గన్నుల కమ్మల​

దివిటీల మును నటుల విధ మొప్ప​

హరిహరాకృష్ట చేలాంచెలంబున నీవి

యందునఁబాణిద్వయంబు మెరయ

మోము వేకువ చందమామ పోల్కిని వెల్గ

నధరంబు పైఁగెంపులలరుచుండఁ

గాలి పావడ జీరాడ కాంచి వీడ​

కౌను జవ్వాడ నారద మౌని పాడ​

మేచకముతోడఁ  దొల్కరి మెరుపుజూడ​

నేఁగుదెంచెను లక్ష్మి సర్వేశునీడ

     — గజేంద్ర మోక్షణము (1886). పు 26