అంసభాగంబున నాడెడు గొప్ప కొ
ప్పున సన్నజాజులు పుడమిరాలఁ
జిన్ని
కెంజాయ వాల్గన్నుల కమ్మల
దివిటీల మును నటుల విధ మొప్ప
హరిహరాకృష్ట
చేలాంచెలంబున నీవి
యందునఁబాణిద్వయంబు మెరయ
మోము
వేకువ చందమామ పోల్కిని వెల్గ
నధరంబు పైఁగెంపులలరుచుండఁ
గాలి
పావడ జీరాడ కాంచి వీడ
కౌను
జవ్వాడ నారద మౌని పాడ
మేచకముతోడఁ దొల్కరి మెరుపుజూడ
నేఁగుదెంచెను లక్ష్మి సర్వేశునీడ
— గజేంద్ర మోక్షణము (1886). పు 26