Sunday, December 13, 2020

ఇంత చక్కని తెలుగు పద్యం ఇంతకుముందు చదివారా?

దండము, దండము, దండము, దండము, 

         దండము, వలమురితాల్ప! నీకు

జొహారు, జొహారు, జొహారు, జొహారు,

          జొహారెరచిదిండి సూడ! నీకు 

గొండీలు, గొండీలు, గొండీలు, గొండీలు,

          గొండీలు కడలి యల్లుండనీకు

కైచాఁపు, కైచాఁపు, కైచాఁపు, కైచాఁపు,

         కైచాఁపనలఁబుట్టుకంటి! నీకు

అలకాపరి దీవెలకోల నీకు

మోడు పోయడ్గు చెమ్మటలాడ నీకు

మఱిమఱియు మొక్కులో పెరుమాళ్ళ నీకు

రెంటత్రాగుడు తిండి మెట్టంటువేల్ప​

........................................................................

ఇది శ్రీ నారాయణ దాసుగారు రచించిన అచ్చతెలుగు శతకమువేల్పువంద లోనిది. "రెంటత్రాగుడు తిండి మెట్టంటువేల్ప​" అను మకుటము గల సీసపద్య శతకము. ఆ మకుటమున కర్థము "సింహాచలస్వామి". నారాయణ దాస స్వానుభవ భాష్యమిది. వారి భక్తి భావ భండారమున కెత్తిన బావుటా. లోకజ్ఞతకు పట్టిన యద్దము. రచన​: 1910. ముద్రణ​: శ్రీ వేద వ్యాస ప్రెస్, విజయనగరము (తొలికూర్పు, 1935)

………………………………………………….

రెంటత్రాగుడు = ఏనుగు

రెంటత్రాగుడుతిండి = సింగము

రెంటత్రాగుడుతిండిమెట్టు = సింగపుంగొండ​