నారాయణ దాసు గారి హరికధలలొ అద్భుతమైన ప్రకృతి వర్ణనలు కనిపిస్తాయి. ఈ క్రిందనిచ్చిన వసంత ఋతు వర్ణన సావిత్రి చరిత్రము లోనిది:
చెవులకుఁ జల్లగ జెలగి కోయిల కూసె
సందడి పెండ్లి బాజాలు మ్రోసె
కన్నె వేపయు దొగర్గున్న సమర్తాడెఁ
జలివేంద్ర దాపున సంత గూడె
కమ్మ మామిడితోట కాపుల పని హెచ్చె
బిల్లగాలులు మురిపించి వచ్చె
గొడుగులు జోళ్లెండ చిడిముడిఁ జల్లార్చె
దాటిముంజలు కడుదప్పిఁ దీర్చె
కారడవి వెల్గెఁ బడవ షికారు గల్గె
సందె లింపాయెఁ గౌగిళుల్సడలిపోయె
ప్రొద్దు లేపాఱి మాపులు పొట్టివాఱె
ఆమని మొదలు పెట్టి ఒక హాయి పుట్టె