నారాయణ దాసు గారు వారి కాలంలో కనపడిన కృతకమైన కవితా ధోరణులను ఇలా దుయ్యబట్టేరు:
పూర్వప్రబంధము పోల్కికై చచ్చిన
యీగనంటిన్చెడు హీనుడొకడు
ప్రౌఢకల్పనలని పన్ని తనకుదానె
యర్ధంబెరుగలేని వ్యర్దుడొకడు
కృతిని నిఘంటువు వెతకి ముదురు తాటి
ముంజెవలెన్ జేయు మూర్ఖుడొకడు
తేట తెల్లంబని తెన్గుబాసకు బట్ట
తెరచి చూపించెడి దేబె యొకడు
కలివశంబున శారద కలుషయయ్యె
బిదపకాలంబున దలంపు పిచ్చియయ్యె
అచ్చుచవకయ్యె మూఢులు మెచ్చుటయ్యె
ఆహహా! ఎందుకు కవులైరి యాధునికులు?
అయితే అయన దృష్టిలో కవితాదార ఎలా ఉండాలి?
సాగి కమ్మెచ్చునన్ వచ్చు తీగకరణి
సాలెపురుగు కడుపులోని నూలువలెను
దబ్బునన్ బొర్లిపడు గొండధారమాడ్కి
సహజకవిత బయల్వెడి సన్నుతిగను