నారాయణ దాసు గారు వారి సంగీత సాహిత్య
జైత్రయాత్రలో దర్శించిన అనేక ప్రదేశాలను, కలసిన వ్యక్తులను పొందిన అనుభూతులను
వర్ణిస్తూ రచించిన పద్యాలను మేలు బంతి అనే గ్రంధంలో ప్రచురించారు. ఈక్రింద
ఇచ్చిన బెంగుళూరు నగర వర్ణన, మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వడయార్ - 10 (1863
- 1894), బెంగుళూరు దర్బారులో ఆశువుగా రచించినది. ఆ పద్యం ఎంతో బాగుందని వ్రాతప్రతిని
అడిగి తీసుకుని భద్రపరుచుకున్నరుట మహారాజా వారు.
అలరుతేనియ లూరు దలిరులజిగి మీరు
విన్నగరువుదీరు బెంగుళూరు
చిరుత మబ్బులకారు చెమటరాని
షికారు
వేడుకలింపారు బెంగుళూరు
చెరకు తీయనినీరు చేలపచ్చనిబారు
వేల్పునగరుగేరు బెంగుళూరు
ఆవుల పాలేరు తావుల వేమారు
పిలువదగిన పేరు బెంగుళూరు
వింత నగనాణెముల నారు బెంగుళూరు
పెనుతెవుళులకు మందు వేర్బెంగుళూరు
తెల్లదొరలను రాగోరు బెంగుళూరు
వేనుడువులేల బంగారు బెంగుళూరు