జానకీ శపథము హరికథలోని ఈ సీసపద్యంలో చమత్కారం వ్యాకరణ శాస్త్రంలో కనీసం
ప్రాధమికమైన ప్రవేశముంటే గాని అవగావహమవదు.
పల్లమువంకఁ బ్రవర్తించె నీర్వి శే
ష్యము జాడఁజను విషేషణముభంగి
అడవి కార్చిచ్చుల కాదేశమై కొండ
వరదయాగమమయ్యె జెరువులకును
అల ప్రకృతిప్రత్యయము లట్టు లన్యోన్య
మెడయ కేళ్ళుం గాల్వలేకమయ్యె
కర్మభావవప్రయోగంబుల దప్పని
యాత్మనేపదమట్టు లలరెకప్ప
వడి నలౌకిక విగ్రహవాక్యము వలెఁ
గోకిల రవప్రమోగంబులేక యుండె
పల్లవిత బహువ్రీహి సంపతటలమగుచుఁ
బ్రబలి వ్యాకరణమువలె వానవెలిసె