హరికథ స్వరూప, స్వభావలెలా ఉండాలో వివరిస్తూ నారాయణ దాసుగారు ఆంధ్ర పత్రిక 1911 ఉగాది ప్రత్యెక
సంచికలో ‘హరికథ’ అనే వ్యాసం వ్రాసారు. అందులోనిది ఈ పద్యం:
ఘన శంఖమో యన గంఠంబు పూరించి
మేలుగ శ్రుతిలోన మేళవించి
నియమము తప్పక నయ ఘనంబుల బెక్కు
రాగ భేదంబుల రక్తి గొల్పి
బంతు లెగిర్చిన పగిది కాలజ్ఞతన్
జాతి మూర్చన లొప్ప స్వరము పాడి
చక్కని నృత్యము సర్వరసాను కూ
లంబుగాగ నభినయంబు చేసి
స్వకృత మృదు యక్షగాన ప్రబంధసరణి
వివిధ దేశంబులం బిన్నపెద్దలు గల
పలు సభల హరిభక్తి నుపన్యసింప
లేని సంగీత కవితాభి మాన మేల