Sunday, March 17, 2024

శ్రీకృష్ణ తత్త్వం, వేదాంత సారం


ఈ రెండు పద్యాలలో శ్రీకృష్ణ తత్త్వాన్ని ఎంతచక్కగా ఆవిష్కరించారో, వాటిలో ఎంత వేదాంతం నిబిడివుందో చూడండి! 

 గీ॥ ద్రౌపదికిదోడ! వెన్నెలదాపరీడ​!

     కల్మిచెలిఱేడ​! బత్తులగ్రాచుప్రోడ​!

     క్రీడి చెలికాడ​! గొల్లలకోడెగాడ​!

     నన్నుగావుము నీవాడ నల్లవాడ​

 గీ॥ అన్నిటికిదుద మొదలయియున్నవాడ !

      పలుతెఱంగుల నొకడవై పరగువాడ !

      దొరికిదొరకని యట్టుల దిరుగువాడ !

      నేనునీవాడజుమ్ము నాలోనివాడ ! 

 ఆదిభట్ల నారాయణ దాసు "గజేంద్ర మోక్షణము" (అంకిత పద్యములు)

No comments:

Post a Comment