యగునె నీ ఋక్సంగ్రహమ్ము కొరుక
వట్టి "ఎం. ఏ" తలంబట్టునే నీ నవ
రసతరంగిణి లోని రసకణంబు
పాణినితో నెంతొ పాతఱికము లేక
తాకగలరె నీ తారక కృతి
పారసితో నాల్గుబాసల మున్గి నీ
యుమ్మర్ కయామ్ చేత నూనవలయు
బ్రహ్మవా మగరూపున బరగువాని
రాణివా కానిచో నిట్టి ప్రతిభ కలుగు
నృహరికై నాల్గుమూలల నెమకుచుంటి
నేడనున్నాడో సత్కవీ నీవె తెలుపు