Tuesday, August 30, 2016

శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారి 152వ జయంతి

"శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస కథా గాన కళా పరిషత్" శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారి 152 జయంతి ఉత్సవాలను స్థానిక బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఆగస్టు 28, 29, 30 తేదీలలో మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించిందికార్యక్రమానికి దేవస్థాన కార్యనిర్వాహక సంఘ కార్యదర్శి శ్రీ మస్తానయ్య స్వాగతం పలికారు.

మొదటిరోజు కార్యక్రమంలో శ్రీ నారాయణ దాసు గారు రచించిన "రుక్మిణి కళ్యాణం" హరికథను శ్రీమతి నేమాని నాగలక్ష్మి భాగవతారిణి గానం చేసి శ్రోతలను రంజింపచేసారుఆమెకు శ్రీ యమ్నగధర రావు మృదంగంపైనాశ్రీ పాలేటి గోవర్ధన రావు వయోలిన్ పైనా సహకార వాద్యం అందించారుశ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస కథా గాన కళా పరిషత్ కార్యనిర్వహకసంఘ సభ్యురాలు డాఉపాధ్యాయుల రాజ రాజేశ్వరి దేవి హరికథా కళాకారిణిని పరిచయం చేసారు సభలో పరిషత్ శ్రీమతి నాగలక్ష్మికి సన్మానం చేసి "హరికథా గానామృత వర్షిణి" అనే బిరుదు ప్రదానం చేసింది.


మిగతా రెండు రోజులలో డాఉపద్రష్ట వేంకట రమణ మూర్తి గారు శ్రీ నారాయణ దాసు గారు రచించిన "హరికథామృతంఅనే సంస్కృత హరికథల సంపుటిని శ్రోతలకు పరిచయం చేసారుడావేంకట రమణ మూర్తి విజయవాడ శారదా కళాశాలలో సంస్కృత భాషా ఉపన్యాసకులువీరు సంస్కృత భాషా ప్రచార సమితి ప్రాంతీయ కార్యదర్శిగా సంస్కృత భాషా పునరుజ్జీవనానికి విస్తృతమైన సేవ చేస్తున్నారుప్రాచ్య భాషా పాఠ్య పుస్తక రచయితగా జాతీయ విద్యపరిశోధనశిక్షణ సంస్థ (NCERT) చే నియుక్తులుఅంతేకాక కేంద్రీయ మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న రాష్ట్రీయ సంస్కృత పరిషత్ సభ్యులు. వారు తమ అద్భుతమైన సంస్కృత భాషా పాండిత్యంతో, వాగ్ధాటితో "హరికథామృతం" మహాకావ్యం యొక్క గొప్పదనానిని, అందులోని ఉపనిషత్, పురాణ రహస్యాలను, కథా కథన విశేషాలను శ్రోతలను మంత్రముగ్ధులను గావించేలా వివరించారు. పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ ఉపాధ్యాయుల నారాయణ దాసు వక్తను పరిచయం చేసి స్వాగత వచనాలు పలికారు. పరిషత్ సహకార్యదర్శి శ్రీ కర్రా సూర్యనారాయణ దాసు జ్ఞాపికలు అందచేశారు. పరిషత్ సభ్యురాలు శ్రీమతి కర్రా కామేశ్వరి వందన సమర్పణ చేసారు.