గుంటూరు
రచయితల సంఘం 1975లో నారాయణ దాసు గారి సాహిత్యంపై 'శ్రీ ఆదిభట్ల నారాయణ దాస సారస్వత నీరాజనం' (సం: డా. శి. వేం. జోగా రావు) అనే సమగ్రమైన సమీక్షా గ్రంధం ప్రచురించింది.
అ గ్రంధంలో ప్రచురణకై కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు ప్రత్యేకంగా రచించిన పద్య
వ్యాసం లోనిది ఈ పద్యం:
ఈ యఖిలమ్మునందుఁ బరమేశ్వరుఁ
డెట్టులు నిండియుండెనో
యా యఖిలమ్ము వచ్చి తనయందున
నుండెన యాదిభట్టనా
రాయణదాసులో హరికధాకృతి
భారతి సర్వశిల్పవి
ద్యాయుతి సంస్కృతాంథ్రముల
యాకృతియై పెఱమూర్తులై మఱిన్
No comments:
Post a Comment