Thursday, March 10, 2016

కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి ప్రశంస


గుంటూరు రచయితల సంఘం 1975లో నారాయణ దాసు గారి సాహిత్యంపై 'శ్రీ ఆదిభట్ల నారాయణ దాస సారస్వత నీరాజనం' (సం: డా. శి. వేం. జోగా రావు) అనే సమగ్రమైన సమీక్షా గ్రంధం  ప్రచురించింది. అ గ్రంధంలో ప్రచురణకై కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు ప్రత్యేకంగా రచించిన పద్య వ్యాసం లోనిది ఈ పద్యం:

ఈ యఖిలమ్మునందుఁ బరమేశ్వరుఁ డెట్టులు నిండియుండెనో
యా యఖిలమ్ము వచ్చి తనయందున నుండెన యాదిభట్టనా
రాయణదాసులో హరికధాకృతి భారతి సర్వశిల్పవి
ద్యాయుతి సంస్కృతాంథ్రముల యాకృతియై  పెఱమూర్తులై మఱిన్